ఓ దేవా మొర వినవా - నా మీద దయగనవా

ఓ దేవా మొర వినవా - నా మీద దయగనవా ||ఓ దేవా||
అలలు పొంగే సాగరాన తీరమేలేదా
కారుచీకటి జీవితాన దీపమే లేదా
నేరమెరుగని దీనజనులకు దారియే లేదా ||ఓ దేవా||

జానకీ సతి జంటబాసీ కాననమునందు
తిరుగులాడిన నాటి గాధమరచిపోయితివా
చలముమాని చరణమొసగి పలుకవా దేవా ||ఓ దేవా||