పల్లవి
[అతడు] బైలా బైలామో సరికొత్త సంగీతంలో
బైలా బైలామో పయనిద్దాం ఈ వేగంలో
ఓ జనగణమే నిలిచింది నీతో
కదం పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంటూ నేడే
మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం ||2|| ||బైలా||
చరణం 1
[ఆమె] మెరుపే బంగారాలుగా మెరవకపోతే రాళ్ళు
అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళు
తెరిపించావోయ్ కళ్ళు విడిపించావోయ్ ముళ్ళు
ముళ్ళైనా నీతో ఉంటే వూలు ||2||
[అతడు] కవ్వించాలి ప్రవహించాలి మనసుల్లోనా మమతల సెలయేరు
ప్రేమించాలి మరిపించాలి నలుగురు మెచ్చే నూతన సర్కారు ||బైలా||
చరణం 2
[అతడు] చూపుల్లోని చురుకు ఊహల్లో ఉడుకు దీపాలై అందించాలి వెలుగు
చేయి చేయి కలుపు పాదం పాదం కలుపు ఏరాలి మొక్కల్లోని కలుపు
[ఆమె] మెలి తియ్యాలి కలిపెయ్యాలి కాలుష్యాల చీకటి కోణాలు
పండించాలి పాలించాలి సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు ||బైలా||