పల్లవి
[అతడు] ఎంతెంతో దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేల
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా
ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగు రంగులు చూపే దేరా
రంగంటూ లేనే లేదు లేరా ||ఎంతెంతో ||
చరణం 1
[అతడు] ఊహల్లో ఊసుల్లో ఆ మాటే ఓ సోసి గొప్ప ఏముంది గనకా
[ఆమె] తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండే కూడ వెండి వెన్నెలవదా
[అతడు] అవునా అదంతా నిజమా ఏదేది ఒక్కసారి కనపడవా
[ఆమె] ఇలలో ఎన్నెన్ని చూసినా అందందు నీవుంటుందిలే బహుశా
[అతడు] మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదులేరా
నీ చెంతే ఉంది దూరం లేరా
[ఆమె] హాయేరా హాయేరా ఎల్లలంటూ నీలో లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయి
చరణం 2
[ఆమె] ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
[అతడు] ఈడొస్తే ఏదైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
[ఆమె] శిలవా నామాట వినవ ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
[అతడు] నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైనా ఊహించదు మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
[ఆమె] హాయిలే హాయిలే ఎల్లలన్నవి లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయి ||ఎంతెంతో||