నేను పుట్టింది నీకోసమే పెరిగింది

పల్లవి

[అతడు] నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
[ఆమె] వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే
[అతడు] మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీకోసం
[ఆమె] లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
[అతడు] మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా
నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా
ముద్దుల మొగుడవుతా ||నేను||


చరణం 1


[ఆమె] కోవెల కెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా
చూశావంటే నేనేం చేసేది
[అతడు] సంతకు వెళ్ళామంటే ఆ బేరమొదిలి నువ్వు
మంతర మేసావంటే నేనేం చెప్పేది
[ఆమె] చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ
తేరిపార చూస్తే సిగ్గెట్టా ఆగేది
[అతడు] కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు
ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది
[ఆమె] ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయ్ బావా
లక్ష్మీబావా... మొగుడవుతా ||నేను||


చరణం 2


[ఆమె] వెన్నెల్లో నేనుంటే నావెన్ను మీద వాలి
ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది
[అతడు] చీకట్లో నేనుంటే నా చుట్టు నువ్వేచేరి
చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది
[ఆమె] స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు
పడకేస్తుంటే నే ఇంకేం అయ్యేది
[అతడు] ఆవలిస్తు ఉంటే ఆగరత్తయి నువ్వొచ్చి
వేడి పొగ లెడుతుంటే నేను ఇంకెటు పోయేది
[ఆమె] ఈ బాధలు తగ్గాలంటే భాజా మోగాలోయ్ బావా
లక్ష్మిబావా...మొగుఢవుతా ||నేను||