నీ పాద సందేవ దయదేయవా
నిజభక్త మందార సదాశివ
నెరనమ్మినాను - కరుణించవా
||నీ పాద||
కామిదాత చేకొనుమిదియే
కోమల పూజా ప్రసూనము
నోచిననోములు ఫలించగా
దేవదేవా పాలించవా
||నీ పాద||
తీయనైన నీ పేరులోనే
తేనియంచిందేను త్రిలోచనా
దాసురాలి ఆశతీర
దరిశనమీయగరావా
||నీ పాద||