ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కని పాపను ఇక్కడుంచారు
ఎక్కడున్నాగాని దిక్కు వారే కదా
చిక్కులను విడదీసి దరిచేర్చలేరా
||ముక్కోటి||
ఆలి ఎడబాటిపుడు అనుభవించెడివాడు
అలిమేలు మంగపతి అతనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు
దోగాడు బాలునికి తోడునీడౌతాడు
||ముక్కోటి||
నెల్లూరు సీమలో చల్లంగ శయనించు
శ్రీరంగ నాయకా ఆనంద దాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునికి శరను
రయసేయుమా నీవు క్షణము యెడబాయక
||ముక్కోటి||
ఎల్లలోకాలకు తల్లివై నీ వుండ
పిల్లదానికి ఇంక తల్లిపేమా కొరత
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గ || ముక్కోటి ||
గోపన్న వలె వగచు ఆపన్నులను గాచు
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా
చైన్నారి బాలునకు స్రీరామరక్షన్ || ముక్కోటి ||
బాలప్రహ్లాదుని లాలించి బ్రోచిన - నరసింహుని కన్న
వేరు దైవము లేదు
అంతు తెలియగరాని ఆవేదనలు కలిగె
చింతలను తొలగించు సింహాచలేశ || ముక్కోటి ||
మొండి చేతులవాడ వెందుకైనావంటే
చేతికెముకయెలేని దాతవని చాటుటకే
నీ రధము కదిలితే శుభము లొనగూరేను
జీవపధమును మార్చు శ్రీ జగన్నాధా || ముక్కోటి ||