జయహే - జయహే

జయహే - జయహే
జయశ్రీకాకుళ దేవా! || ||జయహే||


నవతేజముతో నవపధమున
మాజాతిని నడువగ వెలసితివా
||జయహే||


విష బుద్దులతో విరవిర వీగే
అసురులే మాయలు హరింతువా
నాగ స్వరమున వేణువు నూదుచు
నాగుని తలపై నటింతువా
||జయహే||


లోక శాసనము నేకము సేయగ
శ్రీకాకుళమున వసింతువా
అతెలుగు నాయకుల దేవుడనేనని
వల్లభ పరుదము గ్రహింతువా!
||జయహే||