నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో.. ఏ పూల పూజింతునో
చరణం 1
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె ||2||
నీ పాదసేవా మహాభాగ్యమీవా
నా పైని దయజూపవా.. నా స్వామి ||నీవుండేదా||
చరణం 2
దూరాననైన కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడుకొండలపైనా రేడైన స్వామి
నా పైని దయజూపవా.. నా స్వామి ||నీవుండేదా||