అట్టాంటోడే ఇట్టాంటోడే

పల్లవి

[ఆమె] అట్టాంటోడే ఇట్టాంటోడే ఇంటంట ఇంటంట వస్తాడే
పొమ్మంటుంటె రమ్మంటాడె ఏంటేంటొ ఏంటేంటొ చేస్తాడే
[అతడు] ఎక్కువ ఎక్కువనీకు అందమే ఎక్కువ
[ఆమె] తక్కువ తక్కువ నువ్వు ఎంతలొ తక్కువా...
[అతడు] ఊపి ఊపి ఊపి నాలో కాకరేపినాడే
[ఆమె] ఆడఈడతడిమి ఒలె ఒలె ఊపిరాడనీడే ||అట్టాంటోడే||

చరణం:

[అతడు] నీపైట పెట్టుకో పిన్నీసు గుండెల్తొ ఆడకే టెన్నీసు
కాసేపు వేడిగా నీషేపు చూడగా దాసోహ మవదా గిన్నీసు
[ఆమె] నీకేమొఇప్పుడే ఇచ్చీసు నాకేమొ అప్పుడే పచ్చీసు
నాచెంపగిచ్చిన నాకొంప ముంచిన వాటేసి పాడనా పత్తాసు
[అతడు] వేస్తా చెయ్యేస్తా నీఈడు ఇరగదీస్తా ఓ...
[ఆమె] చూస్తా చుట్టేస్తా జాతర్లు జరగనిస్తా
[అతడు] కసిగా కసిగా కసిగా
[ఆమె] కసికసికసిగా రసికా
[అతడు] పిడికెడినడుమె వదలను ఉడుమై అతుక్కు పొతానులే ||అట్టాంటోడే||

చరణం:

[ఆమె] ముద్దొచ్చినప్పుడే చంకెక్కుసోకన్న అప్పుడే చేజిక్కు
నీగోరుచిక్కుడు నీకొంటె గిచ్చుడు నాతీగలాగడం నీ హక్కు
[అతడు] నీకొంగు జారితె కైపెక్కు నీకాలు జారితే డీడిక్కు
నీతెనెపట్టుని నాతేలు కుట్టగా సిగ్గంత అప్పుడే కొండెక్కు
[ఆమె] ఇస్తా విన్నిస్తా నీ తొందరేంటొ చూస్తా
[అతడు] వస్తా ఒణికిస్తా కౌగిళ్ళ కళ్ళెమేస్తా
[ఆమె] తబలా తబలా కబలా
[అతడు] మొగిస్తాలే అబలా
[ఆమె] అదరని గురుడు బెదురని అనడు వీడెంతదేశముదురో