అబ్బబ్బా వినవే అబ్బాయి

పల్లవి

[అతడు] అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే
అతను నడిచే ఎ.టి.ఎం.పోతే చిక్కడులే ||2||
నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే
మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే
మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే
డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే
లాఠీకున్న పవరే పవర్
ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం
ఎందరికీ వచ్చును ఈ అదృష్టం
డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ
[ఆమె] కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే
[అతడు] ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే
[ఆమె] హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా


[అతడు] ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి
యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా
[ఆమె] పడుకుంటే కలగంటే
[అతడు]అది నిజమేనే చేస్తాగా
అబ్బబ్బా... విను తల్లే
[ఆమె] రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే
ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా
[అతడు] తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే
ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా
[ఆమె] బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే
నువ్వేం అంటావు


[అతడు] ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా
అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా
[ఆమె] సరే కానీ మనమొక్కటై
అతడు : ఇక ఆలూ, మగలవుదాం ఓమ్
[అతడు] అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా
ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం
చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే
ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే
అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి
తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే
అబ్బబ్బా...