మనసులే కలిసెలే

పల్లవి

[ఆమె] మనసులే కలిసెలే
[అతడు] మౌనమే మౌనమే మనసులొ మిగిలెనే
నిన్నిలా చేరగా మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఎప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే...||మనసులే||

చరణం 1

[ఆమె] నీకోసం కలగన్నా కలలోన నినుకన్నా
ఏడబాటు ఎదురైనా నీనీడై వస్తున్నా
ఎదలో... ఎదలో ఎపుడో అటుపైవలవేశావే
కలవో అలవో వలపై ముంచే లోన
[అతడు] ఈప్రేమమైకం ప్రవహించే లోన
నీ ఊహలదాహం శృతిమించే లోలోన
[ఆమె] వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలే చేరిపంచుకుంటా
[అతడు] జతగా...జతగా ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి ||ముద్దు||
ఎకడున్నావే ఎకడున్నావె ఎప్పుడొచ్చావే
నినుకన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే

చరణం 2

[ఆమె] మదిలో గదిలొ ఏదో చేసేశావే
వలపు తలపు నాలొ నింపేశావే
[అతడు] విరహాలరాగం వినిపించే లోగా
ఈ మోహావేసం వినిపించే లోలోన
[ఆమె] బిగిసి బిగిసిక్షణమే యుగమైనన్నుచుట్టుకున్న
ఎగసి ఎగసి నిసలొశసినై నిన్ను చేరుకున్న జతగా జతగా...
[అతడు] మత్తు మత్తు మత్తు జల్లి చిత్తు చిత్తు చిత్తు చేసి||2||ఎకడున్నావే||