శ్రీ మన్మహావిష్ణుదేవా!

శ్రీ మన్మహావిష్ణుదేవా! నితాంత ప్రభావా! భవాంభోధినావా!
మహాయోగి హృన్మండలావాస! ఓ శ్రీనివాసా
దయాశాంత భావంబులన్ నీదునేత్రద్వయి న్నిత్పి
లోకాల పాలించు తేజోవిలాసా

మహొగ్ర స్వరుపంబునన్ నీదు చక్రానల జ్వాల ఈరేడు లోకంబులన్ నన్ను
వెన్నాడి, నా జీవ సంధుల్ దహింపంగ జొచ్చెన్ భరింపంగలేనయ్యా
దీనిన్ మరల్చంగ నీవే సమర్ధుండ వోదేవ దీనాతి దీనుంద ప్రాణార్తుండన్
నన్ను కాపాడవే శ్రీహరీ! పాహిమాం పాహిమాం పాహిమాం