పల్లవి
[అతడు] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకార్యం ప్రతిర్థి ప్రధాయం
బజే వాయుపుత్రం బజే వాలగాత్రం
బజే సూర్యమిత్రం బజే హం పవిత్రం
బజే రుద్రరూపం బజే బ్రహ్మతేజం బజే వజ్రదేహం
బజేహం...బజేహం...బజేహం...
ఏ యోగమనుకోను నీతో వియోగం
ఏ పుణ్యమనుకోను ఈ చేదుజ్ఞానం
తపస్సును కోలేదు నీతోటి స్నేహం
మోక్షమనుకోలేదు ఓ మాశూన్యం
నేలపై నిలపక నెయ్యమై నడపక
చేరువై ఇంతగా చేయి విడిచేందుకా
అరచేత కడదాక నిలుపుకోలేవంటు నిజము తెలిపేందుకా
గాలి కొడుకా ఇలా చూసేపు వేడుక
||శ్రీ ఆంజనేయం||
చరణం 1
[అతడు] రామ నామము తప్ప వేరేమి వినపడని
నీ చెవికెలా తాకెనా వెర్రికేక
నీ భక్తి యోగము ముద్రను భంపరిచేనవట్టి ఒడిలోని ఈ గడ్డిపరక
అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి
అమృతపు నదిలాంటి కరుణలో ముంచి
ఈక తెలియని నాతో ఆడుతున్నావ
కోతి చేష్టలు చేసినవ్వుతున్నావ
||శ్రీ ఆంజనేయం||
చరణం 2
[అతడు] కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా
గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా
గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా
నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా
బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడనువాలి
అనువంత నా ఉనికి అణిగెంతగా
తలను నిమిరే హనుమత నీజాలి
నా చిన్ని బొమ్మవను బ్రమను చెరిపే తెలివి
బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా
నిలువునా నన్నిలా దహించే నీదయా నాకెందుకయ్యా
ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...