పల్లవి
[అతడు] అంతగా ననుచూడకు
[ఆమె] ష్! మాటాడకు
అంతగా నను చూడకు వింతగా గురిచూడకు వేటాడకు
||అం||
[ఆమె] చలిచలిగాలులు వీచెను సన్నని మంటలు లేచెను ||2||
తలపులే కవ్వించెను - వలపుల వీణలు చాలించెను
||అం||
చరణం 1
[అతడు] జిలిబిలి ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను ||2||
పెదవులే కవ్వించెను పదునౌ చూపులు బాధించెను
||అం||
చరణం 2
[ఆమె] వాలుగ నిన్నె చూడని కలకాలం నీలోదాగనీ ||2||
[అతడు] నవ్వులే పండించనీ పువ్వుల సంకెల బిగించని
||అం||