పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు

పల్లవి

[అతడు] పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో!
మనసు పెనవేస్తే ఏమౌతావో

[ఆమె] ఉలికిపాటుతోనే పులకరించిపోతావు
నేను ఔనంటే ఏంచేస్తావో
కాదు పొమ్మంటే ఏమౌతావో

చరణం 1

[అతడు] మొలక నడుము ఇయలు చూసి మురిసిపోదును
జిలుగుపైట నీడలోన పరవశించును ||మొలక||
[ఆమె] సొగసు వెనక నడయువయలు చూడనీయ్యను||2||
కడకొంగున నిను బిగించి నడచిపోదునూ || పలక ||

చరణం 2

[అతడు] పువ్వునై కురులలో పొంచి వుందును
నవ్వునై పెదవీపి పవళింతును ||2||
[ఆమె] పూలతో నిన్ను కూడ ముడుచుకొందును ||2||
పెదవిపైన ఒదిగి నిన్ను కదలనియ్యను ||పలక||

చరణం 3

[అతడు] కలలోనైన నిన్ను నేను కలుసుకుందును
దొంగనై దోరవలపు దోచుకొందును ||2||
[ఆమె] చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ||2||
తొలివలపుల తియ్యదనం తెలపమందును ||పలక||