పల్లవి
[అతడు] రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచే వాడనుకాననుకున్నావేమో
[ఆమె] ఏమనుకున్నారేమో! తమరేమనుకున్నారేమో
మీ చేతులలో నీలుబొమ్మలం మేమనుకున్నారేమో రేమో
చరణం 1
[అతడు] చక్కని కన్నెవు ముక్కున కోపం నీకేల నీకేల
చల్లగాలిలో ఆటలాడగ రావేల రావేలా
[ఆమె] పిలచిన వెంటనే పరుగున చెంతనె చేరాలా చేరాలా
వలచి వస్తివే చులకనైతిగా ఈవేళ ఈవేళ
||ఏమను||
చరణం 2
[ఆమె] దొరగారేదో తొందరపనితో మునిగారా మునిగారా
అందుచేతనే అయినవారిని మరిచారా మరిచారా
[అతడు] నిజమే తెలియక నిందలు వేయకు నామీద నామీద
మాట విసురులు మూతి లిరుపులు మర్యాద మర్యాద ||రానను||
చరణం 3
[ఆమె] క్షణమే యుగమై మనసే శిలయై నిలచేనే నిలిచేనే
[అతడు] నిన్ను చూడగా యుగమే క్షణముగా గడచేనే గడచేనే
యడబాటన్నది ఇకపై లేదని అందామా అందామా!
ఈడుజోడుగా తోడునీడగా వుందామా వుందామా!