పల్లవి
[అతడు] I think I am Love With you Na, Na, Na
I have been thinking about you, May be
Iam in love with you, I don't know, what I am doing
Don't know don't know don't know
ఎవ్వరే నివ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణాం నువ్వైపోయావు
తెలవారింది లేలేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు ||ఎవ్వరే||
చరణం 1
[అతడు] ఎటు చూసినా, ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా
ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందా
నా తీరుతెన్ను మారుతోందిగా ||ఎవ్వరే||
చరణం 2
[అతడు] చెలిచూఫులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా, కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా, ఎవరేం అన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను, చాలా దూరం నడిచాను
తీయని దిఉలై పడి ఉన్నాను, చెలి లేనిదే బతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే... ||ఎవ్వరే||