పల్లవి
[ఆమె] జాం చక్కిడి చిందులుకైనా తోం తక్కిడి సందడికైనా ఓరబ్బ ఓరబ్బా
జాం చక్కిడి చిందులుకైనా తోం తక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాడు
సోంపాపిడి పిందెలకైనా ఆం కామిడి సందులకైనా వెంటపడి వచ్చేవడు కుర్రాడు
బ్రహ్మాండం బద్దలకొట్టే ||2||అణుబాంబులు కుర్రాళ్ళు వయ్యారం దాచినపెట్టే
చలిచీమలు కుర్రాళ్ళు చూపులతోనే గుచ్చేస్తారు సూదులు మాటలతోనే వేసేస్తారు
మందులు ||జాం చక్కిడి||
చరణం 1
[ఆమె] మనస్సు అనే ముంగిలికి మంచి అంటే వాకిలికి ద్వారాలు మీ కుర్రాళ్ళు
కోరుకునే గుండెలకి కన్నెపూల దండలకి దారాలు మీ కుర్రాళ్ళు కొంచెం కేడీలు కించెం
రౌడీలు అచ్చం హీరోలు మీ కుర్రాళ్ళు మూసే గొబ్బిళ్ళు మీరే మీరే మీరేవిరిసే కౌగిళ్ళు
మీరే మీరే మీరే బ్రహ్మండం బద్దలుకొట్టే అణుబాంబులు కుర్రాళ్ళు బ్రహ్మయ్యకి అర్థంకాని
తలరాతలు కుర్రాళ్ళు ||జాం చక్కిడి ||
చరణం 2
[ఆమె] కలుసుకోక కన్నుకొట్టే ముట్టుకోక ముద్దుపెట్టే ముదుర్లు మీ కుర్రాళ్ళు
అడుగుతుంటే ఆశపెట్టెయ్ అడగకుంటే దోచిపెట్టెయ్ దాదాలు మీ కుర్రోళ్ళు చూస్తే
చిన్నోళ్ళు లేస్తే తిక్కోళ్ళు మాకే ఎక్కిళ్ళు మీ కుర్రోళ్ళు చిలిపి ఎక్కిళ్ళు మీరే మీరే మీరే
చిలక కొట్టుడ్లు మీరే మీరే మీరే బ్రహ్మండం బద్దలకొట్టే అణుబాంబులు కుర్రాళ్ళు ఆ స్వర్గం
ఇదిగిదిగో శ్రమజీవుల కుర్రాళ్ళు చూపులతోనే గుచ్చేస్తాత్రు సూదులు మాటలతోనే వేసేస్తారు
మందులు ||జాం చక్కిడి||