పల్లవి
[ఆమె] సిగ్గుతో ఛీ ఛీ చీరతో పేచి ఆపినా ఆగునా పేమ పిచ్చి
[అతడు] వద్దకే వచ్చి బుగ్గలే గిచ్చి ఆపదే తీర్చనా ముద్దిలిచ్చి
[ఆమె] కన్నులే కాచి వెన్నెలై వేచి
[అతడు] నిన్నిలా చూసి నన్ను ఇచ్చేసి
[ఆమె] లాలిస్తూ చూపించు నీలో రుచి
||సిగ్గుతో||
చరణం 1
[ఆమె] పువ్వై పూచి తేనె దాచి వచ్చా నేరుగా
[అతడు] ఆచి తూచి నిన్నే కాచి నా దంటానుగా
[ఆమె] నిన్నే మెచ్చి చెయ్యే చాచి అందించానుగా
[అతడు] నువ్వే నచ్చి అన్నీ మెచ్చి ఉన్నానింతగా నిదురే కాచి నిను గెలిచి
[ఆమె] నిదురే లేచి యెస తెరచి
[అతడు] ప్రేమించే దారి చూపించి
||సిగ్గుతో||
చరణం 2
[ఆమె] నిదురే లేచి యెద తెరిచి
[అతడు] ప్రేమించే దారి చూపించి
[ఆమె] ఈడే వచ్చి పెంచే పిచ్చి మోసా జాలిగా
[అతడు] నువ్వే నాకు తోడై దోచి నన్నే పంచగా
[ఆమె] ఆలోచించి ఆలోచించి చేరా సూటిగా
[అతడు] ఒళ్ళో కోచ్చి వడ్డించాలి నిన్నే విందుగా
[అతడు] మనసందించా మైమరచి
[ఆమె] మనసా వాచా నిను వలచి
[అతడు] కవ్వించే కాను కందించి
||సిగ్గుతో||