అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప

పల్లవి

[అతడు] అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి
నిన్ను పిలిచి
[ఆమె] అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి
సొగసు రుచి
[అతడు] ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి
[ఆమె] వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి ||అమ్మాయి||


చరణం 1


[ఆమె] మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా
చిలిపి తనం
[అతడు] నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది
పడుచుదనం
[ఆమె] అందాల నిధి నీ వశం లోలోన పదిలం
[అతడు] కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం
[ఆమె] వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి
[అతడు] ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి ||అమ్మాయి||


చరణం 2


[అతడు] నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల
[ఆమె] నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా
[అతడు] వయ్యారి చెలివాలకం వారెవ్వా మధురం
[ఆమె] సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం
[అతడు] ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి
[ఆమె] వస్తాపద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి ||అమ్మాయి||