నిను కోరీ శుభవర్ణాలెన్నో పాడే

పల్లవి

[ఆమె] నిను కోరీ శుభవర్ణాలెన్నో పాడే లాహిరి
శ్రీవారి నవరాగాలన్నీ చేసే అల్లరి
ప్రియ ప్రియ మదురిమలే ప్రియంవద ఆ నవ్వేచాలులే
నీ కన్నుల్లోన పాపై వెన్నెల్లోన తోడై ఉంటాలే
[అతడు] ఓ నారీ తొలి వయ్యారాల ఒళ్ళే నా శిరి
సింగారి ముఖ సింధూరాల చిందే నా చెలి

చరణం 1

[అతడు] తందనాల జాడ చందనాల దీన చందనాలకా
చందమామ కోసి సంతకాలు చేసి గుచ్చె కోరిక
[ఆమె] వంగతోట కాడ దొంగ వేట కాడ సందె మాటుగా
చీకటమ్మ బుగ్గ చుక్కకున్న దాక పూలుపెట్టాకా
[అతడు] కృష్ణుడున్న చోట ఉన్నది దేవుడు మెచ్చేట వెన్న
[ఆమె] వెన్న ముద్ద కోరుకున్న ఉన్న నీడ ఇవ్వమన్నా
[అతడు] అనురాగాలే విన్నాలే ఈ వేళ
[ఆమె] చలి ప్రాణాలే ఉయ్యాల ఊగే ఈ వేళ
[అతడు] ఓనారీ తొలి వయ్యారాల ఒళ్ళే నాశిరి
[ఆమె] శ్రీవారి నవరాగాలన్ని చేసే అల్లరి ||నిను కోరీ||

చరణం 2

[ఆమె] కన్నె మోజు లేత సన్నజాజి పూత పూయ వేటగా
సోకు వెన్న పూస నవ్వు తెల్ల పూస వచ్చె ముందుగా
[అతడు] అందమైన నవ్వు పంట పంట నివ్వు మంట
నంగనా చిగా అందమివ్వమంట అందమివ్వమంట ముద్దు
ముద్దుగా
[ఆమె] రాసుకుంటె భక్తి మాల రాయలేని రక్తి చాలా
[అతడు] రాదా అంటే రాసలీల రాసుకున్న ప్రేమ జ్వాల
[ఆమె] శతమానాలే కోరింది ఈ ప్రేమ
[అతడు] చిరుమైనాలే దీవించే మంత్రాలీవేళ ||నిను కోరీ||