పల్లవి
[అతడు] నింగిలో నీలిమా అందని ప్రియతమా ||2||
[ఆమె] ప్రేమకే ప్రాణమా అందమే హృదయమా
[అతడు] మధువులు చిలికే హామహా
[ఆమె] తెలియని తలపే హొ
[అతడు] పెదవులు పలికే తియ్యహా
[ఆమె] పలుకులు వలపే ఓహొ...||నింగిలో||
చరణం 1
[అతడు] గిలిగింతై ఈడు తన గొంతు విప్పినా
[ఆమె] చెలిమి తరిమే
[అతడు] పులకింత గుండు పొదరిల్లు కప్పినా
[ఆమె] చినుకు తడిపే వానల్లో ఎండ వలపంత వెచ్చనా
[అతడు] అవును నిజమే
[ఆమె] ప్రేమల్లో వెంట పరువాలు వెచ్చనా
[అతడు] తెలుసు మనకీ
[అతడు] తూరుపైన పడమరైన ప్రేమకొకటేలే
[ఆమె] నిన్నటేలా కలిస్పోతే ప్రేమ కొరతేలె
[అతడు] నిన్నటేలా కలిసిపోతే ప్రేమ కొరతేలె
[అతడు][ఆమె] సాయంత్రం స్వాగతం సప్తవర్నానులులే
||నింగిలో||
చరణం 2
[ఆమె] తెలియంది ఆపి తెలిసింది చెప్పినా
[అతడు] మధుర మధురం
[ఆమె] జరిగింది కాక జరిగేది తెలిపిన
[అతడు] ఒకరికి ఒకరం
[అతడు] వేసంగి వల్లె వయసంత వాసనా
[ఆమె] అవును క్షణమే
[అతడు] ప్రేమించుకున్న హృదయాల వంతెనా
[ఆమె] క్షణము యుగమే
[ఆమె] చూడకుండా ఉండలేని ఈ తపన మధురాలే
[అతడు] చూసినాక ఆగలేని తలపు నిదురాయే
[అతడు][ఆమె] అనురాగం అడుగుజాడల్లో సప్తవర్ణాలులే
||నింగిలో||