వరుణా ...వరుణా
వర్షింపగదయ్యా వరుణా వరుణా
కరుణాలయ ఏకధారగా
||వరు||
ఘనాఘనా ఘనా ఘనా
ఘనాఘనా వినీల గగనానికి భూతలికి
దిశాంచలములలను కొనుచువెలారీ
||వరు||
పయోధరములు తెరలు తెరలుగా వెలసీ
ఫెళఫెళ ఉరుములురిమి
తళతళ మని మెరుపు మెరసి
నెరవారిన సరసులలో
నీరునిండి వరదపారగా
||వరు||