దాచాలంటే దాగదులే

నా చెంప తాకగానే నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే నాజూకు తగ్గెనేమో

పల్లవి

నా చెంప తాగగానే నీ చేయి కందెనేమో
నా చూపు సోకగనే అరెరె నాజూకు తగ్గనేమో
నాపైన నీకు కోపమా - కాదేని విరహతాపమా
నా పైన నీకు కోపమా - విరహతాపమా
పలుకగా రాదా - అలుక మరియాదా
నీ పదును చూపుల అదలింపులకే
బెదరను బెదరను బెదరనులే
[అతడు] దాచాలంటే దాగదులే
దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా
వదలను వదలను వదలనులే

చరణం 1

నీ కులుకు నడక చూసి రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోముచూసి నింగిజాబిల్లికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూసి రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోముచూసి నింగిజాబిల్లికి నిగ్గు తరిగె
అయ్యారి మేని అందము వయ్యారి తీగెచందము
అయ్యారి మేని అందము తీగె చందము
మరుల గొలిపేను - మనసు దోచేను
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా
కదలను కదలను కదలనులే
||దాచా||

చరణం 2

నీ నల్లని వాల్జడలో విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గ్లపై సిగ్గులు యెదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గ్లపై సిగ్గులు యెదురై పొమ్మనెను
నువ్వులేకపోతే జాబిలి - ఈ లోకమంత చలి చలి
నువ్వులేకపోతే జాబిలి లోకమే చలి చలి
ఏమి చేసేను ఎటులసైచేను
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా
విడువను విడువని విడువనులే
||దాచా||

[ఆమె] దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసెదాకా - వదలను వదలను వదలనులే