కరుణాళో - కమలాకాంతా - మహితా - కామితార్థదాతా
పరమాత్మా - జగదాధారా - శౌరీ - పాహి - చక్రధారి
నీ కన్నన్ - ప్రాపెవ్వరే - జగతిన్ - నిత్య సత్యరూప
వరదా నీరజాప్త నయన రామకృష్ణ - హరిగోవిందా
ప్రేమరూప - నీ మహిమలన్ - ప్రస్తుతింపనెంతటివాడన్
నిరంతరమూ - నీ నామమునే - స్మరించెదరా - దరిజేరుపరా
రామకృష్ణ - హరిగోవిందా