తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే ||తల్లివి||
వేడుకొన్న దయదలైచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వెంకట రమణా, వెంకటరమణా!
నీ కన్నా మాకెవరూ లేనే లేరూ
నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా ||తల్లివి||
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా - నీ
జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా
వెంకట రమణా వెంకట రమణా ||తల్లివి||