పల్లవి
[అతడు] నీపేరు వింటే, నీ పేరు వింటేనే రెచ్చిపోతానే,
నీరూపు చూస్తేనే చచ్చిపోతానే
[ఆమె] నీ చెయ్యి తాకిందా పులకించి పోతానే,
నీ చూపు సోకిందా నెల తప్పిపోతానే
[అతడు] ఓ పిల్లా ఓ పిల్లా బుంగమూతి పిల్లా, ఓ పిల్లా ఓ పిల్లా కాదా
నాగుండె గుల్లా, నీ నవ్వు పొడుగాను నట్టేట ముంచే నన్ను
నీ బుగ్గ కందిపోను తప్పించి లాగే నన్ను నీ పేరు...
ఓ పిల్లా రసగుల్లా, నీ చేయి నొప్పిడితే వదిలేస్తాను
సరసంగ స్నానాలు చేయిస్తాగా...
[ఆమె] నొప్పే వేస్తే స్నానాలెందుకు వేషాలు వద్దంటా,
వంటలు చేస్తే ఆనందిస్తా ఉంటే చాలంట
[అతడు] చలి వేస్తే నీ కౌగిట్లో వెచ్చంగా దూరిపోతా
[ఆమె] నీకంతా కష్టాన్నీ నేకలిగిస్తానో ప్రత్యేకంగా నీకోసం దుప్పటినే తేనా నీ పేరు...
[అతడు] వయ్యారి చీర కట్టు నేర్పిస్తాగా అందంగా నడుమే చుట్టి అల్లేస్తాగా
[ఆమె] చీరను కట్టుకోడం చిన్నప్పుడే నేర్చేసాలే
పెద్దగుణాన్ని మడతే వేస్తే అది చాలులే
[అతడు] వెళ్ళగానే నేను నెల సెలవే పెట్టేస్తాను
[ఆమె]నే సెలవే పెట్టకపోతే నువ్వేం చేస్తావు
యహో ఒంటారిగా ఉన్నవో పోపిచ్చోడవుతావు...
[అతడు] నీపేరు ...