పల్లవి
[అతడు] తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవర నరవర నలుగురితో కలిసి
శ్రీరామచంద్రుణ్ని కోవెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కరా మనిషీ...
తై...దిదితై దిదితై దిదితై దిదితై దిదితై...
||తికమక||
చరణం 1
[అతడు] వెతికే మజిలీ దొరికే దాక కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా కట్టళీ నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదిరంటు లేని మది ఎదురు తిరిగి అడిగేనా...
బదులంటు లేని ప్రశ్నేలేదు లోకాన
నీ సోకమే శ్లోకమై పలికించరా మనిషీ
||తికమక||
చరణం 2
[అతడు] అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పొదుకలకీ పట్టాభిషేకమే కషా
ఆ రామగాధనువు రాసుకున్నదే కాధా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దుర మనిషి
||తికమక||