ఆకులు పోకలు ఇవ్వొద్దు నోరు ఎర్రగ చెయ్యొద్దు

పల్లవి

[అతడు] ఆకులు పోకలు ఇవ్వొద్దు నోరు ఎర్రగ చెయ్యొద్దు||2||
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపాపాపా
[ఆమె] ఆశలు మావా మావా
[అతడు] పాపా
[ఆమె] మామా

చరణం 1

[ఆమె] ఊరుకున్న నన్ను దువ్వి ఊరించవు
నేనోపలేనంతగా ఉడీకించావూ||2||
[అతడు] ఊరించానా నిన్నుడికించానా ||2||
ఒట్టిట్టినిందలేస్తే ఒప్పుకోనా
నా ఉడుకెక్కిందంటేనే నూరుకోను
||పాపా||

చరణం 2

[అతడు] ఎర్రని పెదవిని పంటనొక్కకు
నను వెర్రివాడ్ని చేసి నీవెంట తిప్పకు||2||
[ఆమె] పంటనొక్కానా నీవెంట తిప్పానా
గజ్జల గుఱ్ఱమంటె కన్నెపిల్లకు
కళ్ళుతోటి కళ్లెమేసి కదముతొక్కను
||మామా||

చరణం 3

[ఆమె] ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
ఒద్దు ఒద్దొన్న నిన్ను నే ఒదిలిపెట్టను
[అతడు] ఒద్దాన్నానా నన్నొదల మన్నానా ||2||
పొద్దంతా నీతోటె గడచిపోతాది
నీ ముద్దు మొగముతోనే నాకు పొద్దు పొడిచేది
||పాపా||