రబ్బరు గాజులు రబ్బరు గాజులు

పల్లవి

[అతడు] రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే ||2||
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తిరి నిదరి కొచ్చావే
నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి నువ్వంటె పడిపడి చస్తానే
నీవెంటె పడిపడీ వస్తానే ||2||
[ఆమె] చల్లనిగాలిని చల్లనిగాలిని చెప్పినచోటికి తెచ్చేరో
వెన్నెల గుండెలో వెన్నెల గుండెలో వెచ్చేగ వేలినె పట్టరో
మెత్తని దిండుగ పట్టెను నిన్నుగ గమ్మున పట్టుకునొచ్చేరో ||ఆ|| ||నువ్వంటే పడి పడి||


చరణం 1

[అతడు] రాజుగారి ఎనుగుమీద రైరై రఫ్‌రై రై రై రఫ్ రై అని ఊరిగిస్తానే పిల్లా
రాణిగారి పానుపు మీద దాయిదాయి అమ్మదాయి హాయి హాయి
అమ్మాహాయి అని బొజ్జోపెడతానా పిల్లా
[ఆమె] అట్టాగంటే ఐస్ అవుతానా ఇంకా కాస్తా క్లోస్ అవుతానా
అంతందంగా అలుసవుతానా
అవుతాను
[ఆమె] నీవుగాని ఊ అంటే కీలుగుర్రం ఎక్కింది
జూం అని జాం అని చుక్కలు దిక్కులు చుట్టుకు వస్తానే
నువ్వంటే పడి పడె ||రబ్బరు గాజులు||


చరణం 2

[అతడు] రోజు రోజూ తోటకి వెల్లి ఢీఢీ ఢీక్కంఢీ డీఢీఢీక్కంఢీ
అని లవ్వాడేద్దామే పిల్లా
[ఆమె] ఢీ ఢీ ఢీక్కంఢీ ఢీ ఢీ ఢీక్కంఢి
[అతడు] ఏదో రోజు పేటకు వెళ్ళి పీపీడుండుంపి పిపిడుండుండుండుంపి
అని పెల్లాడేద్దామే పిల్లా
[ఆమె] అట్టా చెపుతే సెట్ అయిపోతా పుస్తె కడితే జట్ట్తె పోతా
ఆకుల్లోన వక్కైపోతా
[అతడు] అ అని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
ఢూం అని ఢుం అని డప్పులు గప్తులు తగిలిచ్చేస్తానే ||నువ్వంటే పడి పడి ||రబ్బరు గాజులు||