పల్లవి
[అతడు] చల్‌తా ఎవరైనా ఓకె... చల్‌తా ఎపుడైనా ఓకె
చల్‌తా ఎక్కడైనా ఓకె... చల్‌తా ఎదురొస్తే షాకె
ముక్కుసూటిగా ముందుకెళ్ళడం చిన్ననాటి హాబీ
తిక్కరేగితే దుమ్ముదులపడం నేర్చుకున్న రగ్బీ
నమ్మినోళ్ళపై ఈగవాలినా పెరుగుతుంది బి.పి
ఉప్పుకారము తిన్న వొళ్ళది. ఊరుకోదు తంబీ
ఏలేలో నే వెళ్ళే వేలే...అడ్డమొస్తే సంగతంతేరో...
ఏలో ఏలో నువ్ చేసే పనిలో మజాలేలో దిల్‌సే కర్‌లో...||చల్‌తా||
చరణం
[అతడు] గుండెదమ్ము నా తోడు సత్తువుంది నా సైడు
ఫాస్టు బాలుగా బౌండరీలనే దాటుతుంది నా స్పీడు
నచ్చికోడే నా వాడు ...నాకు నేనే పైవాడు.
కొండగాలిలా సొంతదారిగా సాగుతుంది నా దౌడు...
మాటలో ... భోలాభాలా మండితే ...హల్లాగుల్లా
గిల్లి గిరి దాటారంటే ... రచ్చరచ్చగోలా
లుక్కులో సాదాసీదా ఎక్కితే జర్దాబీడా
లొల్లి మొదలయ్యిందంటే... పగిలిపోద్ది తబలా ||ఏలెలో||
చరణం
[అతడు] మచ్చలేని మనసున్నా మంచిచెడ్డలేవైనా
మనీ లేనిదే మనిషీ జీవితం మరోపూట గడిచేనా
నీతులెన్నో మనకున్నా అవి కూడు పెట్టవంటున్నా
ఆకలేసి ఈ లోకమేమిటో చదివి తెలుసుకున్నా
కాసులే... ఏలే చోట కడుపుకై...రోజొక ఆట
కనపడే దునియా నిండా... స్వార్థమున్నమాట
కలియుగం...కత్తుల వేట కరకుగా...తగిలే చోట
కలేజా చూపకపోతే... గెలుపు లేదుబేటా
బస్తీరాజా రమ్మన్నాడంటే ... రంగరంగా రభసౌతదిరా
దోస్తేరాజా రైటన్నాడంటే ... రంగ్‌బర్‌సే పండగౌతదిరా