ముంతాజ్ మహలు కట్టించాడే షాజహాను

పల్లవి

[అతడు] ముంతాజ్ మహలు కట్టించాడే షాజహాను
ముత్యాల మహలు కట్టిస్తానే నీకై నేను
మాట్లాడే ఫోను కనిపెట్టాడే గ్రహంబెల్లు
ముద్దాడే ఫోను కనిపెడతానే నీకై నేను
[ఆమె] ఠాంక్యూ ఠాంక్యూ నీ మాటకు ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ ప్రేమకు ఠాంక్యూ
చరణం 1

[అతడు] ఈఫిల్ టవరు ఈడ్చుకువచ్చిన నీ ముంగిట్లో పెట్టేస్తాను
[ఆమె] టవరు గివరు ఎందుకు నాకు ఫ్లవరు ఒకటిస్తే చాలునంటా
[అతడు] చైనా వాలు చేత్తో పట్టి నీ చుట్టూర నిలబెడతాను
[ఆమె] వాలు గీలు ఎందుకు నాకు నీ కౌగిళ్ళే చాలు
[అతడు] సప్తసాగరాలలో నీరు మొత్తం ఇంకు లాగా మార్చేస్తా
ఫాంటింగ్ పెన్నులోనా అదినింపు పెద్ద ప్రేమ బ్యానరే రాస్తా
[ఆమె] ఠాంక్యూ ఠాంక్యూ నీ కానుకకి ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ కొత్త లవ్‌కి ఠాంక్యూ

చరణం 2

[అతడు] డైలి పేపర్ కొత్తగా పెట్టి లవ్లీ వార్తలు పంపిస్తాను
[ఆమె] పేపరు గీపరు ఎందుకు నాకు పెదవుల మంత్రం చాలునంటా
[అతడు] టి వి చానల్ ప్రారంభించి తియ్యని కథలు చూపిస్తాను
[ఆమె] చానల్ గీనల్ ఎందుకు నాకు చూపుల చిత్రం చాలు
[అతడు] కొత్త సాటి లైటునే తెచ్చి దాన్ని హార్టు షేపులో మార్చి
నాలో గాటు ప్రేమనే నింపి దాన్ని ఇంటి చుట్టూ తిప్పిస్తా
[ఆమె] ఠాంక్యూ ఠాంక్యూ నీ పట్టుకి ఠాంక్యూ
ఠాంక్యూ ఠాంక్యూ నీ పిచ్చికి ఠాంక్యూ