ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

పల్లవి

[అతడు] ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీకై నేను ఆలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా
ఎన్నేన్నో పెదవుల తలుపులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసైన ఉన్నా
||ఏకాంతంగా||

చరణం 1

[అతడు] మాయని రేఖలు ఎన్నోనా అరచేతుల్లో
ఇంకా చెప్పని సంగతులెన్నో నా యెద గొంతుల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల వేగంలో
ఇంకా తెరవని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలు మునకేస్తున్నా
ప్రియమైన సంఘర్షనలు పులకిస్తున్నా
నా వయసంతా వలపై ఉన్నా
||ఏకాంతంగా||

చరణం 2

[అతడు] అంజన నేనైవుంటా నీహృదయంలోనా
చాలని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
వెచ్చన నేనైవుంటా నీ ఒడి ఒడిలోనా
వెచ్చని రక్షణ నేనైవుంటా ఒడి దుడుకుల్లోనా
నీ జీవన నదిలో పొంగే నీరవుతున్నా
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
సుఖజన్నాల ప్రేమవుతున్నా
||ఏకాంతంగా||