ఏదేమైనా కాని ఏదేదో మైకాన్ని

పల్లవి

[ఆమె]ఏదేమైనా కాని ఏదేదో మైకాన్ని ఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా
నేనీకే చూపిస్తా ఐదో కన్నే లేని మూడోగుండె
రాని చోటులో ఢీకొని పాలే తాగిస్తా
తాపాలే తాగిస్తా వేడిగా
పెదాలతో ప్రతీది మీటనా
లిఖించగా సుఖాలనే సకాలమందునా ||ఏదేమైనా కాని||

చరణం 1

[అతడు]సోకేనాకే సోకేదాకా దూరాలన్ని దూరంచేసే నా
అందం మొత్తం అందేలాగ
బందాలన్ని బందీ చేసేనా వెన్నెల్లోన తేవాలి ఈవేళ వేసవి
వేకువలే ఎలాగైనా తోడాలి నీలోన ఆగిన ఆరెనులే

చరణం 2


[అతడు]నీరేనిప్పై తప్పే ఒప్పై తోచేలాగేనన్నె దోచేరు
మోహం నిండే దేహం
నీదే దహన్నింక దహనం చేసేరా నాప్రాయాన్ని ప్రణయాన్ని
ప్రాణాన్ని నీకై అర్పించా
[అతడు]నా స్వప్నాల స్వర్గాల సౌఖ్యాలు నీలో అర్షించా
ఏదైమైనా కాని ఏదేదో మైకాన్ని ఇంకేదో లోకాన్ని నాకే చూపించు
నీవు నాకే చూపించు ఐదో కన్నేలేని మూడో గుండెరాని చోటుల్లో
నాతోని పాలే తాగించు తాపాలే తాగించు వేడిగా పెదాలతో
ప్రతీది మీటవా లిఖించగా సుఖాలనే సకాలమందునా .