పల్లవి
[అతడు] సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏకంటికైన
రెప్పల దుప్పటి కప్పేచీకటి చూపించేనా ఏకాంతినైన
[ఆమె] నిను నీవే సరిగా కనలేదే మనసా
[అతడు] నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా ఏవో జ్ఞాపకాలు
సుడిదాటి పడలేవా ఎన్నో తీపి సంగతులు రేపు పిలుపు వినవలేవా
చరణం 1
[అతడు] చంద్రుడి ఎదలో మంటని తుమ్మెర అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు కనక కాక్షాలు అడిగి ఎవరైనా
ప్రాణాం ఇనికిపైన అనుమానపడరు ఎపుడైనా ||నిను నీవె సరిగా||
చరణం 2
[అతడు] పోయింది వెతికే వేదనా పొందింది ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలచేదెపుడో
సందేహం కలిగే నదికి కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా ||నిను నీవె సరిగా||