పుట్టలోని నాగన్నలేచి రావయ్య

పుట్టలోని నాగన్నలేచి రావయ్య
స్వామీ పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా వేయి దండాలయ్యా
||పుట్టలోని||


నీ కోరల్లో విషము దాచుకొవయ్యా
నీ బుసకొట్టే కోపం ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి పూజ మేము చేసేము
||పుట్టలోని||


ప్రాణాచారంబడ్డ నాంచారమ్మా
గుట్టుగా ఏమని కోరినావమ్మా
మంచి మొగుడు కావాలని మోజుపడ్డావా
చిట్టి పాప ముట్టాలని మొక్కుకున్నావా
అనుకున్నది అయితేను ముడుపులు చెల్లిస్తనని
అనవే అనవే నువ్వనవే నువ్వనవే
||పుట్టలోని||


మా పసుపు కుంకుమా ఎప్పుడు పచ్చగుండాలి
ఏటేటా నిన్నే మా యిలవేల్పుగ కొలవాలి
పుట్టలోని నాగన్న ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా...