[పద్యం]
శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు
కరుణతో నిను సదా గాచుగాక
అజ్ఞాన తిమిరాన అల్లాడు హృదయాన
విజ్ఞాన జ్యోతులే వెలుగుగాక
వనజాసనుడు రాణి - వాగ్దేవి శారద
నిరతమ్ము నీ నోట - నిలుచుగాక
సదసద్వివేకమ్ము, చాతుర్య విభవమ్ము
అనయమ్ము నీ సొమ్ము లౌనుగాక
వేలుపకైన నీ మాటె వేదమగుగాక
తరతరాలుగా నీ కీర్తి పరలుగాక
మాన్యతను బొంది - మహిని రామన్నగాధ
అమరకావ్యముగా నిల్చి అలరుగాక