ఓ రంగయో- పూలరంగయో

ఓ రంగయో- పూలరంగయో
ఓరసూపు చాలించి సాగిపోవయో
పొద్దువాలి పోతున్నదోయి - ఇంత
మొద్దు నడక నీకేలనోయి
[అతడు] పగలనక రేయనక పడుతున్న శ్రమనంత
పరులకొరకు ధారపోయు మూగజీవులు
[ఆమె] ఆటలలో పాటలలో ఆయాసం మరిచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు ||ఓ||
[ఆమె] కడుపారగ కూడులేని - తలదాచగ గూడులేని
యీ దీనుల జీవితాలు మారుడెన్నడో
[అతడు] కలవారలు లేనివారి కష్టాలు తీరుదారి
కనిపెట్టి చేయగలిగినప్పుడే ||ఓ||