తార తళుకు తార తనివి తీరా

పల్లవి

[అతడు] తార తళుకు తార తనివి తీరా పలుకగా
[ఆమె] ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
[అతడు] కొలువుంటాగా కనుల ఎదర
[ఆమె] కలిసుంటాగా బ్రతుకు చివర ||తార||


చరణం 1


[అతడు] నిను కలిశెను నిమిషమున కవినవనా
[ఆమె] నువ్వు కలవని తరుణమున కలతవనా
[అతడు] నడిరేయి పగలవ్వనా
[ఆమె] ఒడిచేరి సగమవ్వనా ||తార||


చరణం 2


[అతడు] నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా
[ఆమె] నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా
[అతడు] జడనిండా పూలవ్వనా
[ఆమె] తడి కంట పూజించనా ||తార||