ధగ ధగ మెరిసే మెరుపుల రాణి

పల్లవి

[అతడు] ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
[ఆమె] నేనే నీ మోనాలిసా
[అతడు] తెగ పొంగే వయ్యారాలే అన్నీ
[ఆమె] నీకై నే కానుక చేసా
[అతడు] ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ
[ఆమె] నిన్నే నేనే మెచ్చా చాలా వినుకోవా మన్మధ బాలా
నేర్పిస్తా అల్లె సెయ్యాలా
[అతడు] తధిగినతోం తకధీం తక తారారే
తధిగతోం నువు నువ్వే కావాలి
తధిగినతోం తకధీంతక రసలీల
తధిగినతోం తెగ రందుల రంగీళ ||ధగ||


చరణం 1


[అతడు] ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు
చాటు మాటు చే గుట్టు ఓపికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళకవసరం
వస్తా నేను కల కలా దేఖోనా
[ఆమె] అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా నాలోనా లోలోనా
[అతడు] తదిగినతోం ... రంగీళ ||ధగ||


చరణం 2


[ఆమె] దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు
రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు
చూశా తమరి వాలకం చేసా తమకు సాహంసం
అన్నీ చేసుకోవడం దివానా
[అతడు] ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాల నేనిట్టా
తదిగనతోం ... రంగీళ ||ధగ||