సూర్యదేవ దయాకరా - మము
బ్రోవుమయ్య పరాత్పరా - మము
బ్రోవుమయ్య పరాత్పరా
హే జగత్కర్తా దుఃఖ
దారిద్ర్య వర్తా చూడుమా
దీనబాంధవుడు
అపుత్రులకే విధాతా కావుమా
హే దివాకర హే ప్రభాకర
ఆదిదేవప్రణామము
వేయిమార్లు ప్రణామము
కాంతిపుంజప్రచండ హే
ఆదిత్యలోక దురంధర
అవని చీకటి హరించే నీ
సప్తహయముల తలచి
జ్ఞానధన విజ్ఞానదాతా
ఆదిదేవ ప్రణామము
సూర్యదేవ ప్రణామము
వేయిమార్లు ప్రణామము