మాసామి యిందురుడా

మాసామి యిందురుడా - మాదేవ యిందురుడా
వానాలిచ్చే పచ్చికలిచ్చే - పానాలు కాపాడేవాడా ||మా||

నీ సేవలనె సేయుదమయ్య
మా సేమము నీవారయుమయ్య
యేదేవత నీ సరి కాదయ్య
నీ దయగల్గిన కొదవేమయ్య ||మా||