బూరె లాంటి బుగ్గ చూడు
కారు మబ్బులాంటి కురులు చూడు
వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్
అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ
హేయ్.. ఓ.. వాలు కళ్ళ వయ్యారి
తేనెకళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసులోకి జారి
చంపినావే కావేరి
హో.. బూరెబుగ్గ బంగారి.. చేపకళ్ళ చిన్నారి
బుంగమూతి ప్యారి.. నంగనాచి నారి..
లవ్వు చెయ్యి ఓసారి
నిన్ను చూసినాక ఏమైందో పోరి
వింత వింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి
నువ్వు కనపడకుంటే తోచదే కుమారి
నువ్వు వస్తే మనసంతా.. స రి గ మ ప గ రి ||ఓ వాలు||
నన్ను ముంచినావే దేవేరి
చరణం 1
నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంట..
నీకు ప్రాణమైనా రాసి ఇస్తా
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవెనల్లే మార్చుకుంట..
దాన్ని ప్రేమలాగా స్వీకరిస్తా
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే
ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే
ఒప్పుకో తప్పవే ఇప్పుడే ఇక్కడే..
నీకు నేను ఇష్టమేనని ||ఓ.. వాలుకళ్ళ||
నన్ను ముంచినావే దేవేరి
ఒహ్ ఆ హొ ఒహ్ ఆ హొ
కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో
ఒహ్ ఆ హొ ఒహ్ ఆ హొ
ఆరడుగుల అందగాడు ఒప్పుకో
చరణం 2
ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే.. బంతిపూల దారి వేస్తా..
లేత పాదమింక కందకుండా
ఆ జాబిలమ్మే నాలైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా!
ఏ పాడుకళ్ళు చూడకుండా
నాలాంటి మంచివాడిని.. మీరంత చూసి ఉండరే
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే..
నువ్వు నాకు సొంతమేనని ||ఓ.. వాలు||
నన్ను ముంచినావే దేవేరి