అదరం అదరం మధురస తపనం

పల్లవి

[ఆమె] అదరం అదరం మధురస తపనం మరిగిన కరిగిన సమయం ||2||
[అతడు] పరువము పరువము పరి పరి విధముల పరిచయమడిగిన ప్రళయం
[ఆమె] ఉరికిన కెరటమే తగిలే సొగసులో
[అతడు] పిడికిలే తెరిచెను రగిలె వయసులో
[ఆమె] తడికి తపన రేగి తలుపు తీసి తడిమిన హే జానమా
||అదరం||

చరణం 1

[ఆమె] ఎప్పుడు లేని ఎదల సాదలేవో ఎందుకో ఏమిటో ఎగదిపడితే
[అతడు] చెప్పుకోలేని చిలిపి కథలేవొ నిప్పున గుప్పున సెగటరగిలే
[ఆమె] లేత చిరుగాలిలోకి వయసు వణికినా ప్రేమలకి ప్రేమ రేగి మనసు బెణికినా
[అతడు] ఏదో లేలే ఇదే వేళ అలలు దోల కలలి గోల తడువకే తడువకీ
||అదరం||

చరణం 2

[అతడు] ఇప్పుడే ఈడు బుసలు కొడుతుంది బుగ్గలో సిగ్గులే మిడిసిపడితే
[ఆమె] వెచ్చని తోడు వెంటపడుతోంది అగ్గెనా దగ్గరై అదిరిపడితే
[అతడు] పూర్తి పదహారు దాటి కలు ముదిరిన ఏటి యెదమోరు మీద వలలు విసిరినా
[ఆమె] నీతో నేను ఏమైపోను చిలిపి చేప గిలిమి రేప మనకిల కిలకిల
||అదరం||