పల్లవి
[అతడు] ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ
దేవగణపూజలు దిక్బాలకుండ ఇహలోక పరిపాలకుండ
యముండ యమలోక వాసుండ పాపపుణ్య పరిశీలకుండ
కర్తవ్యపాలకుండ యముందకు పితృండ యువచిత్ర గుప్తుండ
[ఆమె] జలక్‌దికలజా యమధర్మరాజా పరుకురే పూజా డోలు భాజా
పడుచు ధర్వాజా, తెలుసుకొని ఆజా, సొగసులే ఖాజా, సోకు లేజా
అరె దొరకదు కులుకుల రోజా చేయి మరి పెదవుల పూజా
నీ నోటికి ఇస్తా నారింజ, భేషుగా ఉందిగా రోజా
ఇక తహతహలాడరా భోజా సరిమల్లెల గుడికడతా రాజాభళి
చేతికందదు తీయని ఖాజా అందుకోరావా యువరాజా
మరి ఈనాటి రకాలు ఏనాటి సుఖాలు దొరకదురా ||జలక్||
ధీన్ తన ధీన్ తన...తోం
చరణం 1
[ఆమె] ఆకుతో వడ్డించేయనా ఆకలే తగ్గించేయనా
చిలకలే నీకందించి సేవ చేయనా జుం జుమ్‌కు రార చికచిక ||2||
గాబరా పుట్టీంచేయనా ఆగరా ముద్దిచ్చేయనా
ప్రాయమే కరిగించి కానుకీయనా తలుపులు తీసేయ్ కిటకిట
తలుపులు మీటె చిట చిట
[అతడు] మోహినీ ముద్దిచ్చేయి భామిని బంధించేయి
కామిని కవ్వించెహయి కామిని రక్షననియ్యి
[ఆమె] తపించి తపించి మరిపించగా తలొంచి తలొంచి తరించగా
[అతడు] తధి తో, తోం... తకిట... ఆ.... ||జలక్||
చరణం 2
[ఆమె] సోయగం సంధిచేయనా ఆ కాయను అందించేయనా ఆహా
చేయనా నీతో యుద్ధం ఓరినాయనా ||జుం జుమ్‌కు తార||
మొత్తము నీకిచ్చేయనా మత్తులో తూగించేయనా
తరమే మాయమై తెల్లవారెనా పైటల చాటున కిటా కిల సరసకు వస్తే చిటా పట
[అతడు] కోమలి కొంచెం కోరితే వదిలించేయి నెమలిలా నాట్యం చేయి
అగ్గిలో ఆజ్యం పొయ్యి నశించి నశించి భుజించరా
వారెవ్వా మరింత మరింత హరించరా
తకట...తోం...తోం... ||జలక్ దికలాజా||
యముండ...