మమ మల్లెచెండా కాకాకా

పల్లవి

[ఆమె] మమ మల్లెచెండా కాకాకా కాయాపండా
[అతడు] వవవ వక్కాదిండ ఆకువక్క నోరే పండ
[ఆమె] జోరుగుమ్మ అవుతుందిరా జోడుకట్టి పోదాం పదా
[అతడు] ఏకమైతే ఈడుజోడూ ఎవ్వరాపేరులే సరేపదా
చేచేచే చేతవెన్నముద్దకన్న నీనీనీనీ ముద్దు మజాలే
గాగాగా గాజులన్ని గోలలమ్మ నానానానా మోజులిస్తాలే

చరణం 1

[అతడు] ఏయ్ జజ్ఞనాక దరువులే భలే గజ్జలకే పరుగు ఇదే
కవ్వింతలే మరి తుల్లింతలే
[ఆమె] ఏయ్ తద్దినక తెలుగువలె మద్దెలకే మెలుకువలె
ముద్దుందిలే భలే పొద్దుందిలే
[అతడు] పిల్లా ఎన్నాలికో జడి ఉంచానుపంచణా ఏమంటవే చెలి అంటుంకుంటే
[ఆమె] కోరుకున్నది అందినా పొందినా ఈ మంట ఆరదు అంటుకుంటే
[అతడు] చెలరేగిందిలే మరి తడిపొడి తిల్లానా
[ఆమె] ఇదేకద సరా సరి తందనునా
[అతడు] నీనినిని ఆకుచాటు పిందెలన్ని నేనేనేనే గిల్లుకుంటానే
[ఆమె] నానానానా పైట మరీ జారుకున్న నీనీనీనీ పట్టుకావాలే

చరణం 2

[అతడు] కొక్కొరోకో కోడివలె ముగ్గులలో రధమువలె
రమ్మందిల్ మనసిమ్మందిలే
[ఆమె] ఏయ్ ముక్కెరకే మెరుగువలె
చక్కెరలో చెరకువలె చిలకుందిలె అది కొరికిందిలే
[అతడు] ఏయ్ నీగుండె లోతుగ ప్రేమగా డోముగా నే
ఊగనా ఇక ఉయ్యాలగా
[ఆమె] కోక జారుడు ఆపినా ఆగునా చందమామను నమ్ముకుంటే
[అతడు] కొనసాగేదెలా మరీ ఎడాపెడా...
[ఆమె] ముఖాముఖీ ముడే పడే చిందులోనా ||నీనీ నీనీ ఆకుచాటు వవవ వక్కాదిండా||