నీలాల నీకళ్ళు నాప్రేమ

పల్లవి

[ఆమె] నీలాల నీకళ్ళు నాప్రేమ సంకెళ్ళు అందంగ వందేళ్ళు
బందించవ ఈ ప్రియతమా
[ఆమె] నీవేడి కౌగిళ్ళు నాలోన తాకిళ్ళు వెచ్చంగ వెయ్యేళ్ళు
లాలించవ నాప్రాణము

చరణం 1

[అతడు] నీగుండెల్లో చోటెంతుందో ఆనింగి చెప్పిందిలే
[ఆమె] నీమాటల్లో మత్తెంతుందో ఈ గాలి చెప్పిందిలే
[అతడు] ఏకమవుతున్న ఈ మాయ చెప్పింది హయి ఎంతుందని
[ఆమె] విచ్చుకుంటున్న ఈపూల మౌనాల నాకు చెప్పాయి
మనసంతా నువ్వేనని ||నీలాల నీకళ్ళు||
చరణం 2

[అతడు] నీతో ఉంటే నీరెండయినా వెన్నెలవుతుందిలే
[ఆమె] నీతోడుంటే ఏరేయైన వేకువవుతుందిలే
[అతడు] నువ్వు నా సొంతం అవుతుంటె నా శ్వాశ వెల్లువతుందిలే
[ఆమె] జంటగా నిన్ను చేరాక నాఈడు కోటి జన్మాలనే
కోరుకుంటుందిలే ||నీలాల నీకళ్ళు||