నాలో ఊహలకు నాలో ఊసులకు

పల్లవి

[ఆమె] నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా పరుగులుగా కలే ఇలా ఇవాళ నిన్నే చేరాయి ||నాలో ఊహలకు||

చరణం 1
[ఆమె] కళ్ళలో మెరుపులు గుండెలో ఉరుములె
పెదవిలో పిడుగులె నవ్వులో వరదలె
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమే బ్రాంతిలో ||నాలో ఊహలకు||

చరణం 2

[ఆమె] మౌనమే బిరుకుతూ బిడియమే అడుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్న చూస్తూ ఆవిరౌతు అంతమవ్వాలనీ ||నీలో ఊహలకు||