పల్లవి
[అతడు] చెంగు చెంగు మంటు తుళ్ళితున్న తీగమొగ్గ
కింగ్‌లాంటి పల్లెటూరు చెన్నకేశవ
ఘల్లు ఘల్లు ఘల్లు మన్న ఎడ్లబండి జోరుచూసె
ఏరువాక సాగుతుంటె చెంతచేరవ
ఏయ్ ఎర్రా నియబ్బసన్ ఆ ఎండపొద్దుకు జర్రు సుర్రు
అంటుగుచ్చి ఈ పల్లె బుగ్గకు కోలో కోయిలపాట
ఆ కొమ్మ పొద్దుకు కోలో వెన్నెల్లో పూట ఆకొండ కోనకు
[కోరస్] ఏలలో ఏలోమ్మ ఏలో ఏలో చెమ్మకోళిలో ఏలో ||2||చెంగు చెంగు||
చరణం 1
[కోరస్]నూనూరు మీసాల ఊరిపెద్దలం ఎవడెంతతోడైన
మాదిపెత్తనం పక్కవాడెడిస్తె ప్రాణమిస్తాం బక్కవాడు
కనిపిస్తె ఏడిపిస్తాం వెన్నుపూస లేనోడ్ని ఎండగడతాం
వెన్నపూజ మనసుంటె వెంటపడతాం
కాళిపట్టి తిరుగుతున్న బాలచంద్రులం ఆకలేసి
అలిసినోళ్ళ కళ్ళదుర్చడం ఏయ్
చరణం 2
[అతడు]చిట్టిగువ్వ రెక్కరంగు చీరకట్టుకొన్నది
ఉట్టమీద వెన్నలాగ ఊరిస్త ఉన్నది
[ఆమె] కొబ్బరాకు ముచ్చులా కొమ్ము తిప్పుకున్నది
జంట చూసి నాటనుంచి బెంగపెట్టుకున్నది
[అతడు]నాలేతతమలాపాక నారాజానిమ్మలపండ
నాజొన్నామామిడి మొగ్గ నాకున్న మొక్కమావటి ||ఏలో ఏలమ్మ||
చరణం 3
[అతడు]మేలుకో దేవుడో మనసా ||2||
బొమ్మనే చేసాడు, ప్రాణమే పోసాడు సిరులిచ్చి
నీలోంచి చింతలే తీర్చాడు ఉన్ననాడే మేలుకోని
ఉట్టికెక్కమన్నాడు ఊపిరాగిపోయిందా మట్టిపాలె వీడు ||మేలుకో దేవుడో||
ప్రాయమంత పండగే చేసాము తలపండినాక
తత్వమే చెపుతాము అనుభవించనివ్వు నువ్వు ఈవైభోగం
వయసు ఉడికిపోయినాకె వైరాగ్యం ||చెంగు చెంగు||