దివాళి హొలీ కలిసిమెరిసే

పల్లవి

[ఆమె] దివాళి హొలీ కలిసిమెరిసే ఖుషీ మాది ఓ...
పువ్వుల దారి రమ్మని పిలిచే తొలి ఉగాది
ఏదో వైపుగా సాగే జీవితం మళ్ళీఇ హాయిగా నవ్విందీ క్షణం
దూరం కాని ఆనాటి స్నేహం కదా
చేయందించి మాతోడు నడిచిందిలా
[ఆమె] గుండెలలో ఈ సరదా పండుగలా ఉంది కదా ||దివాలి||

చరణం 1

[ఆమె] తియ్యని కలత్తె నాచిరుచేదు తియ్యని స్వరమైన దీనాడు
[ఆమె] వేసవి వడగాలి దరిరాదు వెన్నెల కలిసింది మాతోడు
[అతడు] ఇప్పుడు మొదలైన సంతోషాలు ఇకపైన ఉంటేచాలు
[ఆమె] నిన్నలు కలగన్న ఆనందాలు రేపటిలో మానేస్తాలు ||దివాలి||

చరణం 2

[ఆమె] ఎందరువున్న ఎవరు లేని ఒంటరి తనమింక కనరాని
[అతడు] కోరిన తీరం ఎదురు పడని అడుగు తడబాటు ఇకలేదు
కొమ్మకు చిగురైన కొత్త ఉగాది సందడిగా రాబోతుంటే
రెప్పలు బరువైన నిమిషాలన్ని వేడుకగ మారాలంతే ||దివాలి||